నిబంధనల అమలులో రాజీ పడొద్దు: జేసీ
ABN , First Publish Date - 2020-11-04T04:16:01+05:30 IST
పరిశ్రమల నిర్వహణ కు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు అమలుపర చడంలో రాజీ పడొద్దని జేసీ వెంకటరావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో డీఐపీసీ సమావేశం నిర్వహించారు.
కలెక్టరేట్, నవబంరు 3
పరిశ్రమల నిర్వహణ కు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు అమలుపర చడంలో రాజీ పడొద్దని జేసీ వెంకటరావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో డీఐపీసీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 65 ప్రమాద కర పరిశ్రమలకు గాను, 44 పరిశ్రమలను తనిఖీ చేశామని, వాటిలో కొన్నింటికి నోటీసులు జారీ చేశా మని జిల్లా పరిశ్రమల మేనేజర్ ప్రసాద్‌రావు వివరించారు. ప్రభుత్వం జీవో నెంబరు 156లో పేర్కొన్న ప్రతి ఆంశాన్ని ఇటు అధికారులు అటు పరిశ్రమలు నిర్వాహకులు తప్ప కుండా పాటించాలని జేసీ ఆదేశించారు. జాయింట్ ఇన్‌స్పెక్షన్ కమిటీ సభ్యులు తరచూ కంపెనీలు తనిఖీ చేయాలని, ఆ నివేదికలు తమకు అందించాలని తెలిపారు. విద్యుత్ శాఖ నుంచి అధిక సంఖ్యలో 33, కాలుష్య నియంత్రణ మండలి నుంచి 16, పరిశ్రమల శాఖ 26 , బాయిలర్స్ విభాగంలో రెండు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కంపెనీలు అందజేసిన నివేదికులు పూర్తిగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జేసీ సూచించారు. పరిశ్రమలు నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలోని ఆగ్ని మాపక, పరిశ్రమలు , కాలుష్య నియంత్రణ మండలి , విద్యుత్ శాఖల అధికారులు ఉన్నారు.