ఉల్లి కోసం బారులు!
ABN , First Publish Date - 2020-10-24T12:16:25+05:30 IST
ఉల్లిపాయల కోసం ప్రజలు క్యూకట్టారు. రైతుబజార్ల వద్ద శుక్రవారం బారులుదీరారు. ఉల్లి ధర రూ.100కు చేరువవుతున్న..

రాయితీ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన జేసీ కిషోర్‌కుమార్
రింగురోడ్డు, అక్టోబరు 23: ఉల్లిపాయల కోసం ప్రజలు క్యూకట్టారు. రైతుబజార్ల వద్ద శుక్రవారం బారులుదీరారు. ఉల్లి ధర రూ.100కు చేరువవుతున్న పరిస్థితుల్లో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కిలో రూ.40కు అందించేందుకు నిర్ణయించింది. విజయనగరంలోని ఆర్అండ్బీ రైతుబజారు, పాత మహారాజా ఆస్పత్రి వద్ద ఉన్న రైతుబజార్లలో ఉల్లి విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేసింది. శుక్రవారం ఉదయం జేసీ కిషోర్‌కుమార్ వాటిని ప్రారంభించారు. ఆధార్ కార్డు ఉన్నవారికి కిలో ఉల్లిని రూ.40కే అందించారు. రాయితీపై ఉల్లి అందిస్తున్నట్టు ముందుగానే ప్రకటించడంతో ఉదయం ఏడు గంటలకే రైతుబజార్ల వద్దకు కొనుగోలుదారులు చేరుకున్నారు. క్యూలో గంటల తరబడి వేచి ఉన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ ఏడీ శ్యామ్‌కుమార్ పాల్గొన్నారు. విక్రయ కేంద్రాన్ని ప్రారంభించి వెనుదిరుగుతున్న జేసీకి దీనావస్థలో ఓ వృద్ధురాలు కనిపించింది. కాలికి గాయాలతో కనిపించిన వృద్ధురాలి వద్దకు వెళ్లి ఆరాతీశారు. తనది దాసన్నపేట విద్యుత్ భవనం ప్రాంతమని, తన పేరు నరసమ్మ అని చెప్పింది. ఆమె పరిస్థితిని చూసి చలించిపోయిన జేసీ రూ.1000 అందించారు. వైద్యసేవలందించి ఇంటికి చేర్చాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు.