పునరావాస కేంద్రాల అభివృద్ధికి చర్యలు : జేసీ

ABN , First Publish Date - 2020-08-01T10:14:02+05:30 IST

పునరావాస కేంద్రాల అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని జేసీ కిషోర్‌కుమార్‌ ఆధికారులను ఆదేశించారు.

పునరావాస కేంద్రాల అభివృద్ధికి చర్యలు : జేసీ

భోగాపురం, జూలై 31:  పునరావాస  కేంద్రాల అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని జేసీ కిషోర్‌కుమార్‌ ఆధికారులను ఆదేశించారు.  శుక్రవారం    ఆ గూడెపువలస, లింగాలవలస సమీపంలో అభివృద్ధి చేస్తున్న స్థలాలను పరిశీలించారు. పునరావస  కేంద్రాల్లో అవసరమైన తాగునీరు, రహదారి పనులు  త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రైతుభరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.  ఎయిర్‌పోర్టు ఏర్పాటులో భాగంగా మరాడపాలెం, ముడసర్ల పేట, రెల్లిపేట, బొల్లింకలపాలెం గ్రామస్థులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ద్వారా గూడెపువలస, లింగాలవలస సమీపాల్లో అన్ని సౌకర్యాలతో స్థలాలు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.  ఇన్‌చార్జి ఆర్డీవో సాల్మన్‌రాజ్‌, మండల ప్రత్యేక అధికారి వెంకట రావు, తహసీల్దార్‌ జి.అప్పలనాయుడు, ఆర్‌ఐ శ్రీనివాసరావు, సర్వేయర్‌ వెంకట పతిరాజు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-01T10:14:02+05:30 IST