5 రోజులు...రూ.13 కోట్లు!

ABN , First Publish Date - 2020-12-26T05:32:44+05:30 IST

ఇంటింటికీ శుద్ధ జలం అందించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. దీని కోసం ‘జలజీవన్‌ మిషన్‌’ను ఏర్పాటు చేసింది. ఇం

5 రోజులు...రూ.13 కోట్లు!




ఇదీ ‘జలజీవన్‌ మిషన్‌ ’ టార్గెట్‌

ప్రాథమిక దశ దాటని వైనం

(కలెక్టరేట్‌)

ఇంటింటికీ శుద్ధ జలం అందించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. దీని కోసం ‘జలజీవన్‌ మిషన్‌’ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఇంటింటికీ కుళాయి వేయాలన్నది లక్ష్యం. ఇందుకుగాను రూ.292 కోట్లు మంజూరు చేసింది.  1871 పనుల కోసం ఈ మొత్తాన్ని కేటాయించింది. ప్రజోపయోగ పథకమే అయినా పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. ఈ నెలాఖరులోగా  రూ.13 కోట్లకు సంబంధించి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. కానీ కేవలం ఐదు రోజుల్లో ఇది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రూ.5 లక్షల్లోపు, రూ.5 లక్షలు మించిన పనులను విభజించారు. తక్కువ జనాభా ఉన్న గ్రామాలకు రూ.5 లక్షల లోపు, ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలకు రూ.5 లక్షలకు పైబడి పనులు కేటాయించారు. రూ.5 లక్షల లోపునకు సంబంధించి 626 పనులకు రూ.19 కోట్లు కేటాయించారు. ప్రసుత్తం 320 పనులు మొదలు పెట్టారు. జనవరి నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.5 లక్షల పనులను జూన్‌ నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. ప్రసుత్తం మంజూరు చేసిన నిధులు ఇంటింటికీ కొళాయిలు ఇవ్వడానికి మాత్రమే సరిపోతాయని వ్యాపారులు చెబుతున్నారు. పైపులైన్ల నిర్మాణానికి నిధులు చాలవని అంటున్నారు. దీనికితోడు పనుల్లో  ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ పి.రవి వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా...కుళాయిల ఏర్పాటుకు నిధులు సరిపోతాయన్నారు. పనులు చురుగ్గా చేపడుతున్నట్టు చెప్పారు. పురోగతిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నట్టు పేర్కొన్నారు. 


111111111111111111111111111111111111111111111111111111111

Updated Date - 2020-12-26T05:32:44+05:30 IST