సమస్యలను ఎస్‌ఐ దృష్టికి తీసుకెళ్లాలి : డీఎస్పీ సుభాష్‌

ABN , First Publish Date - 2020-12-16T05:28:53+05:30 IST

గ్రామాల్లో సమస్యలను సంబంధిత ఎస్‌ఐకు తెలి యజేయాలని సచివాలయ మహిళాపోలీసులకు డీఎస్పీ సుభాష్‌ కోరారు.

సమస్యలను ఎస్‌ఐ దృష్టికి తీసుకెళ్లాలి : డీఎస్పీ సుభాష్‌

కురుపాం, డిసెంబరు 15: గ్రామాల్లో సమస్యలను సంబంధిత ఎస్‌ఐకు తెలి యజేయాలని సచివాలయ మహిళాపోలీసులకు డీఎస్పీ సుభాష్‌ కోరారు. మంగళ వారం కురుపాం పోలీస్‌స్టేషన్‌లో మహిళ సచివాలయ పోలీసుల విధులు - బాధ్య తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మహిళ సచివాలయ పోలీసులు ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్పర్‌ డిపార్టుమెంట్‌, మ హిళ మిత్రలతో సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామాల్లో  మహిళలకు రక్షణగా ఉంటూ, వారికి చట్టాలపై అవగాహన కల్పిస్తూ చైతన్య వంతులు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎల్విన్‌పేట సీఐ టి.తిరుపతిరావు, ఎస్‌ఐ రవికుమార్‌, జగదీష్‌ నాయుడు, మండలంలో గల మహిళ సచివాలయ పోలీసులు పాల్గొన్నారు.

Read more