-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Isolation beds should be set up in the CHC
-
అమ్మవారి ఆలయంలో టీడీపీ నేతల పూజలు
ABN , First Publish Date - 2020-08-20T10:38:24+05:30 IST
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కిమిడి నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నాయకులు బుధవారం కనకమహాలక్ష్మి అమ్మవారి ఆల

చీపురుపల్లి: టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కిమిడి నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నాయకులు బుధవారం కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు జరిపారు. ముందుగా ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రౌతు కామునాయుడు నేతృత్వంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేశారు. కార్యక్ర మంలో పార్టీ నాయకులు గవిడి నాగరాజు, ఆరతి సాహు, రౌతు నారాయణ రావు, కలిశెట్టి సత్యనారాయణ, మండల చైతన్య తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ చీపురుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి కిమిడి నాగార్జునకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఫోన్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటూ కార్యకర్తలకు సేవలందించాలని చంద్ర బాబు ఆకాంక్షించారు.
మెరకముడిదాం: గ్రామంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎం.రమణమోహనరావు ఆధ్వర్యంలో నాగార్జున జన్మదిన వేడుకలు నిర్వహించారు. మొదటిగా శివాలయంలో పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కేక్ కటింగ్ చేశారు. టీడీపీ నేతలు భాస్కరరాజు, పి.సన్యాసి నాయుడు, శ్రీరాం పాల్గొన్నారు.