ఇదేనా న్యాయం?

ABN , First Publish Date - 2020-11-22T04:46:29+05:30 IST

‘గిరిజనుల పక్షపాతిని, నిజమైన గిరిజనుడునని చెప్పుకునే నియోజకవర్గ ప్రజాప్రతినిధి కుడుమూరు భూముల విషయంలో పేదలకు చేసే న్యాయం ఇదేనా?’ అని ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి ప్రశ్నించారు. కుడుమూరు రెవెన్యూ పరిధిలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను ఆమె శనివారం పరిశీలించి...రైతులతో మాట్లాడారు.

ఇదేనా న్యాయం?
కుడుమూరు భూములను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ సంధ్యారాణి

ఎమ్మెల్సీ సంధ్యారాణి
పాచిపెంట, నవంబరు 21 :
‘గిరిజనుల పక్షపాతిని, నిజమైన గిరిజనుడునని చెప్పుకునే నియోజకవర్గ ప్రజాప్రతినిధి కుడుమూరు భూముల విషయంలో  పేదలకు చేసే న్యాయం ఇదేనా?’ అని ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి ప్రశ్నించారు. కుడుమూరు రెవెన్యూ పరిధిలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను ఆమె శనివారం పరిశీలించి...రైతులతో మాట్లాడారు. అధికార పార్టీ నాయకుల మాటలకు తలొగ్గి 250 గిరిజన కుటుంబాలకు ఆ నేత అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కుడుమూరు రైతులకు న్యాయం జరిగే వరకు టీడీపీ తరుపున పోరాడుతామన్నారు. సర్వే జరిగినప్పుడు అధికారులు ఉండాలని, వైసీపీ నాయకులు, ప్రైవేటు వ్యక్తులు ఉండాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారులపై ఫిర్యాదులు చేస్తామన్నారు. ప్రభుత్వపరంగా సర్వే చేసి గిరిజనులకు సాగు పట్టాలు ఇవ్వాలని, లేదంటే అసెంబ్లీలో ప్రస్తావిస్తా నని తెలిపారు. కుడుమూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 48లో 782 ఎకరాల్లో 250 గిరిజన కుటుంబాలు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సాగు చేసుకుంటున్నాయని, ఇప్పుడు బజారున పడేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వెంట టీడీపీ నేతలు పిన్నింటి ప్రసాద్‌బాబు, సాలూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, నాయకులు ముఖి సూర్యనారాయణ, రౌతు తిరుపతిరావు, పూసర్ల నరసింగరావు తదితరులు ఉన్నారు.


Read more