పురోహితులకు రుణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-11-28T04:56:19+05:30 IST

రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ సంక్షేమ సంస్థకు అనుబంధంగా ఉన్న ఏపీ బ్రాహ్మణ కోపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ ద్వారా పురోహితు లు రుణం పొందేందుకు పురోహిత్‌ మిత్ర అనే పథకాన్ని అందిస్తున్నట్టు ఏపీ పురోహిత అర్చక సమాఖ్య ఉపాధ్యక్షుడు అంపోలు ఉమామహేశ్వర శర్మ తెలిపారు.

పురోహితులకు రుణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

కొత్తవలస, నవంబరు 27: రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ సంక్షేమ సంస్థకు అనుబంధంగా ఉన్న ఏపీ బ్రాహ్మణ కోపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ ద్వారా పురోహితు లు రుణం పొందేందుకు పురోహిత్‌ మిత్ర అనే పథకాన్ని అందిస్తున్నట్టు ఏపీ పురోహిత అర్చక సమాఖ్య ఉపాధ్యక్షుడు అంపోలు ఉమామహేశ్వర శర్మ తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకులకు రుణాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. ఈ విధంగా రుణం పొందే అర్చకులు తప్పనిసరి క్రెడిట్‌ కోపరేటివ్‌ సొసైటీలో సభ్యులు ఉండాలని తెలిపారు. నలుగురు అర్చకులు గ్రూపు గా ఏర్పడినట్టయితే ఒక్కొక్క గ్రూపునకు గరిష్టంగా రూ.లక్షా60వేలు చొప్పున రుణం అందిస్తారని అన్నారు. రుణం తీసుకున్న సభ్యులకు బీమా సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని రాష్ట్రంలో ఉన్న అర్చకులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

Read more