21న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2020-11-20T05:06:42+05:30 IST

సీడాఫ్‌ - వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం సంయుక్తంగా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీలలో ఉద్యో గావకాశాలు కల్పిస్తున్నట్టు డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు.

21న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

విజయనగరం(ఆంధ్రజ్యోతి), నవంబరు 19: సీడాఫ్‌ - వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం సంయుక్తంగా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీలలో ఉద్యో గావకాశాలు కల్పిస్తున్నట్టు డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 21న గజపతినగరం, విజ యనగరం ప్రభుత్వ జూనియర్‌ కళశాలల ఆవరణలో ఇం టర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అభ్యర్థులు విద్యా ర్హతతో పాటు తాజాగా తీసుకున్న పాస్ట్‌పోర్ట్‌ ఫొటో, ఆధార్‌ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. డెక్కన్‌ కెమికల్స్‌లో కెమిస్ట్‌, సీనియర్‌ కెమిస్ట్‌ ఉద్యోగాల కోసం బీఎస్సీ కెమిస్ట్రీ చదువుతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఉద్యోగం చేయా ల్సి ఉంటుంది. అరబిందో ఫార్మాస్యూటికల్స్‌లో ఉద్యోగానికి కెమికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లమో చేసి ఉండాలి. హెల్పర్‌ ఉద్యోగాలకు టెన్త్‌ పాస్‌ లేక ఫెయిల్‌ అయినా అర్హులే. వీరు విశాఖలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. హెటిరో డ్రగ్స్‌లో చేసేందుకు ఐటీఐ ఫిట్టర్‌ చదివిన వారు కావాలి. వారియర్స్‌ ఆర్గనైజేషన్‌ కంపెనీలో చేసేందుకు ఎంబీఏ, బీఎస్సీ పూర్తిచేసినవారు అర్హులు.

Updated Date - 2020-11-20T05:06:42+05:30 IST