దేవునికణపాక భూములపై ఆరా
ABN , First Publish Date - 2020-12-02T04:39:01+05:30 IST
దేవునికణపాక భూముల వ్యవహారంపై లోతుగా విచారణ సాగుతోంది. డిప్యూటీ తహసీల్దార్ లావణ్య, ఆర్‌ఐ అప్పలరాజు, వీఆర్‌వో అప్పలనాయుడు, రెవెన్యూ సిబ్బంది కలిసి మంగళవారం సర్వే నెంబర్ 10, 16, 49లలో ఉన్న భూముల వివరాలను, పట్టాలను పొందిన వారి పేర్లను పరిశీలించారు. స్థానిక గిరిజనులతో మాట్లాడారు. భూములకు సంబంధించి వారి దగ్గరున్న ఆధారాలను తీసుకురావాలని ఆదేశించారు.

సర్వే నంబర్లగా వారీ విచారణ
గుర్ల, డిసెంబరు 1: దేవునికణపాక భూముల వ్యవహారంపై లోతుగా విచారణ సాగుతోంది. డిప్యూటీ తహసీల్దార్ లావణ్య, ఆర్‌ఐ అప్పలరాజు, వీఆర్‌వో అప్పలనాయుడు, రెవెన్యూ సిబ్బంది కలిసి మంగళవారం సర్వే నెంబర్ 10, 16, 49లలో ఉన్న భూముల వివరాలను, పట్టాలను పొందిన వారి పేర్లను పరిశీలించారు. స్థానిక గిరిజనులతో మాట్లాడారు. భూములకు సంబంధించి వారి దగ్గరున్న ఆధారాలను తీసుకురావాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల జోలికి ఎవరూ వెళ్లవద్దని చెప్పారు. మరోవారం రోజుల పాటు విచారణ జరుగుతుందని, అనంతరం నివేదికను జిల్లా అధికారులకు అందిస్తామని డిప్యూటీ తహసీల్దార్ తెలిపారు.
అధికారుల గుండెల్లో అలజడి
గుర్ల మండలంలో అధికారులు బాధ్యతలు స్వీకరించడానికి భయపడుతున్నారు. ప్రభుత్వం వరుసగా అధికారులపై చర్యలు తీసుకోవడంతో ఇక్కడ పనిచేయడానికి వెనకడుగు వేస్తున్నారు. గతంలో ఇక్కడ నలుగురు తహసీల్దార్‌లపై ఏసీబీ దాడులు జరిగాయి. రెవెన్యూ సిబ్బందిలో ముగ్గురు ఏసీబీకి పట్టుబడ్డారు. అప్పట్లో ఎంపీడీవోలుగా ఉన్న మణి, శ్యాంసుందర్, కామేశ్వరరావు తక్కువ వ్యవధిలో బదిలీ అయ్యారు. వారం కిందట తహసీల్దార్ సస్పెండ్ కావడం.. ఎస్పీ కార్యాలయానికి ఎస్‌ఐని సరెండర్ చేయడం తదితర పరిణామాలపై ఉద్యోగుల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.