ఇంద్ర ఏసీ బస్సులు వచ్చేశాయ్‌

ABN , First Publish Date - 2020-03-21T10:21:05+05:30 IST

స్థానిక ఆర్టీసీ డిపోకు ప్రభుత్వం రెండు ఇంద్ర ఏసీ బస్సులు కేటాయిం చింది. ఈ మేరకు శుక్రవారం

ఇంద్ర ఏసీ బస్సులు వచ్చేశాయ్‌

పార్వతీపురం టౌన్‌, మార్చి 20 : స్థానిక ఆర్టీసీ డిపోకు  ప్రభుత్వం రెండు ఇంద్ర ఏసీ బస్సులు కేటాయిం చింది. ఈ మేరకు శుక్రవారం పార్వతీ పురం ఆర్టీసీ డిపో మేనేజర్‌ జాన్‌ సుందరం వాటిని పరిశీలించారు.  సుదూర ప్రాంతాల ప్రయాణికుల కోసం ప్రభుత్వం రెండు ఇంద్ర ఏసీ బస్సులు మంజూరు చేసిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్త బస్సులను నడుపుతామన్నారు.  కొత్తగా వచ్చిన రెండు ఏసీ బస్సులను విజయవాడకు నడుపు తారా.. లేదంటే గతంలో ఇచ్చిన మాట ప్రకారం..  హైదరాబాద్‌, భద్రాచలానికి నడిపే అవకాశం ఉందా లేదా...? అన్న విషయం తేలాల్సి ఉంది.

Updated Date - 2020-03-21T10:21:05+05:30 IST