పెరిగిన అటవీ ఉత్పత్తుల ధరలు

ABN , First Publish Date - 2020-12-26T05:27:15+05:30 IST

గిరిజన సహకార సంస్థ పరిధిలో గిరిజనులు సేకరిస్తున్న పలు రకాల అటవీ ఉత్పత్తుల ధరలు పెంచినట్లు గుమ్మలక్ష్మీపురం గిరిజన సహకార మార్కెటింగ్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ డి.కృష్ణ తెలిపారు

పెరిగిన అటవీ ఉత్పత్తుల ధరలు

గిరిజన సహకార సంస్థ బ్రాంచ్‌ మేనేజర్‌ కృష్ణ

గుమ్మలక్ష్మీపురం, డిసెంబరు 25: గిరిజన సహకార సంస్థ పరిధిలో గిరిజనులు సేకరిస్తున్న పలు రకాల అటవీ ఉత్పత్తుల ధరలు పెంచినట్లు గుమ్మలక్ష్మీపురం గిరిజన సహకార మార్కెటింగ్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ డి.కృష్ణ తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కొండ తామర జిగురు మొదటి రకం కిలో రూ. 110లు, రెండో రకం రూ. 70లు, కరక్కాయలు కేజీ రూ. 12లు, కానుగ గింజలు కిలో రూ. 22లు, ముసిడి గింజలు కిలో రూ. 52లు, ఇండుగ పిక్కలు కేజీ రూ. 45లు, ఉసిరికాయ పప్పు కేజీ రూ. 55లు, నల్ల జీడి పిక్కలు కిలో రూ. 18లు, నరమామిడి చెక్క కేజీ రూ. 22లు, తేనె కిలో రూ. 170లు, గిల్లకాయలు కేజీ రూ. 150లు, తానికాయలు కిలో రూ. 15లు, చింతపండు పిక్కతో కిలో రూ. 36లు, చింతపండు పిక్క తీసినది కిలో రూ. 63లుగా ధరలు పెంచామని అన్నారు. ఈ మేరకు గిరిజనులు సేకరించిన అటవీ ఫలసాయాలను దగ్గరలో ఉన్న జీసీసీ డీఆర్‌ డిపోలకు తీసుకువెళ్లి తమకు సహకరించాలని కోరారు. ఈ ఉత్పత్తులన్నీ చాలా నాణ్యమైనవన్నారు. ఈయన వెంట జీసీసీ అకౌంటెంట్‌ ఎస్‌.రాము, జీసీసీ సిబ్బంది ఉన్నారు.


Updated Date - 2020-12-26T05:27:15+05:30 IST