-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Increase in electricity tariffs is a failure of the government
-
విద్యుత్ చార్జీల పెంపు ప్రభుత్వ వైఫల్యమే
ABN , First Publish Date - 2020-05-13T11:12:47+05:30 IST
ప్రస్తుతం విద్యుత్ చార్జీల పెంపు జగన్ ప్రభుత్వ వైఫల్యమేనని స్థానిక ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి

ఎమ్మెల్సీ సంధ్యారాణి
సాలూరు, ఏప్రిల్ 12: ప్రస్తుతం విద్యుత్ చార్జీల పెంపు జగన్ ప్రభుత్వ వైఫల్యమేనని స్థానిక ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి ఆరోపించారు. ఆమె మంగళ వారం స్థానిక విలేకర్లకు తన ఫోన్ ద్వారా సందేశాన్ని పంపించారు. విద్యుత్ బిల్లులు ఎవ్వరూ చెల్లించవద్దని పిలుపునిచ్చారు. లాక్‌డౌన్ సమయంలో కరెంటు బిల్లులను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున పోరాటం చేస్తామన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు ఎస్సీలకు కూడా రూ.2వేలకు పైన విద్యుత్ బిల్లులు వేశారని విమర్శించారు. ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో ఎప్పుడూ విద్యుత్ బిల్లులు పెంచలేదన్నారు.