-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Incident evil in Ramatirtha
-
‘రామతీర్థంలో ఘటన దుర్మార్గం’
ABN , First Publish Date - 2020-12-30T05:59:24+05:30 IST
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం కొండపై ఉన్న కోదండ రామస్వామి ఆలయంలో రాములోరి తలభాగాన్ని వేరు చేయడం దుర్మార్గమైన చర్య అని బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు భవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

దాసన్నపేట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం కొండపై ఉన్న కోదండ రామస్వామి ఆలయంలో రాములోరి తలభాగాన్ని వేరు చేయడం దుర్మార్గమైన చర్య అని బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు భవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం : రాష్ట్రంలో దేవాలయాలకు రక్షణ కరువైందని జ్యోతిషుడు మురపాక కాళిదాసుశర్మయాజీ అన్నారు. మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రామతీర్థంలో కొండపై శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇటువంటి సంఘటనలపై ప్రభుత్వం దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.