ఢిల్లీ రైతుల ఉద్యమానికి మద్దతుగా...
ABN , First Publish Date - 2020-12-18T05:09:06+05:30 IST
ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా ఆత్మహత్య చేసుకున్న సిక్కు ప్రబోధకుడు సంత్ బాబా రాంసింగ్‌కు పట్టణ కళాసీసంఘం, రైతుకూలీ సంఘం నాయకులు గురువారం సాయంత్రం నివాళి అర్పించారు.

బొబ్బిలి: ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా ఆత్మహత్య చేసుకున్న సిక్కు ప్రబోధకుడు సంత్ బాబా రాంసింగ్‌కు పట్టణ కళాసీసంఘం, రైతుకూలీ సంఘం నాయకులు గురువారం సాయంత్రం నివాళి అర్పించారు. ఈ మేరకు పట్టణంలో కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. రైతుకూలీ సంఘం రా ష్ట్ర సహాయ కార్యదర్శి దంతులూరి వర్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని అన్నారు. కార్య క్రమంలో బోగాది అప్పలస్వామి, పిరిడి అప్పారావు, టీవీ రమణ, ఎడబాల అప్పారావు పాల్గొన్నారు. స్థానిక గాంధీ వి గ్రహం ముందు రైతు , ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతుల ఉద్యమానికి మద్దతుగా కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. రైతు ప్రతినిధులు మురళీ కృష్ణ, రెడ్డి వేణు, ఇందిర తదితరులు పాల్గొన్నారు. బెలగాం: రైతులకు నష్టం కలిగిస్తూ, కార్పొరేటర్లకు లాభం చేకూర్చే వ్యవసాయ, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 20 రోజులుగా ఢిల్లీ నడిబొడ్డున రైతులు పోరాడుతున్నారన్నారు. వీరికి దేశ పౌరులంతా మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు కేవలం కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చే విధంగా ఉన్నాయి తప్ప రైతులకు, దేశ ప్రజలకు లాభం చేకూర్చే చట్టాలు కావని అన్నా రు. రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమా ండ్ చే శారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జి ల్లా కమిటీ సభ్యులు కె.రాజుతో పాటు హాస్టల్, పట్టణ కమిటీ సభ్యులు మహేంద్ర, చక్రి, రాజు, స్వాతి, తరుణ్, సా యి, గణేష్, రమేష్, పాల్గొన్నారు.