-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Impressive poem competitions
-
ఆకట్టుకున్న పద్య పోటీలు
ABN , First Publish Date - 2020-12-30T06:07:29+05:30 IST
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం భా సోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పద్య పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో జూనియర్స్, సీనియర్స్ విభాగంలో వేపాడ విద్యార్థులు ఆల్ రౌండర్‌గా నిలిచారు.

వేపాడ : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం భా సోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పద్య పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో జూనియర్స్, సీనియర్స్ విభాగంలో వేపాడ విద్యార్థులు ఆల్ రౌండర్‌గా నిలిచారు. పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం డి.కన్నయ్య ఈ పోటీలను ప్రారంభించగా... న్యాయనిర్ణేతలుగా ఉపాధ్యాయులు రవికుమార్, శ్రీలక్ష్మి, సుజాత వ్యవహరించారు. జూనియర్స్ విభాగంలో ఎ.గౌతమి(బ్రిడ్జి స్కూల్) ప్రఽథమ స్థానంలో, బి.త్రిలోచన (వేపాడ) ద్వితీయ స్థానంలో, ఆర్.మీనాక్షి (బ్రిడ్జి స్కూల్)తృతీయ స్థానంలో నిలిచారు. సీనియర్స్ విభాగంలో బి.నీరజ (నీలకంఠరాజపురం), ఎన్.జ్యోత్స్న (వేపాడ), కె.దివాకర్(వేపాడ) వరుసుగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.