సమస్యలపై సత్వరం చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2020-12-07T05:30:00+05:30 IST
స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యలపై గిరిజనులు అందిస్తున్న వినతులను పరిశీలించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో ఆర్.కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు.

ఐటీడీఏ పీవో కూర్మనాథ్
పార్వతీపురం, డిసెంబరు 7 : స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యలపై గిరిజనులు అందిస్తున్న వినతులను పరిశీలించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో ఆర్.కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం పీవో స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ సమస్యలపై ప్రజలు అందించిన వినతులను స్వీకరించారు. పాచిపెంట మండలంలో నాటుకోళ్ల పెంపకానికి షెడ్లు మంజూరు చేయాలని పీవోకు పలువురు గిరిజనులు వినతిపత్రం అందించారు. పార్వతీపురం మండలం బందలుప్పి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని పీవోను కోరారు.
పాచిపెంట తహసీల్దార్‌పై ఫిర్యాదు పాచిపెంట మండల తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు కోరుతూ పీవోకు వినతిపత్రం అందించారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములు గిరిజనులకే హక్కులు కల్పించాలని కోరారు. పాచిపెంట మండలంలో గిరిజనులు సాగు చేస్తున్న భూములను గిరిజనేతరులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పీవోకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు సురేష్, తదితరులు పాల్గొన్నారు.