ప్రైవేట్‌ లేఅవుట్లకు ఆన్‌లైన్‌లో అనుమతులు

ABN , First Publish Date - 2020-11-14T04:32:42+05:30 IST

ఇళ్ల స్థలాల కోసం ప్రైవేట్‌ వ్యక్తులు వేసే లేఅవుట్లకు అనుమతి ఇచ్చే అధికారం పంచాయతీ కార్యదర్శులకు లేదు. లేఅవుట్లు వేసేవారు విధిగా ఆన్‌లైన్‌లో నిర్ణీత రుసుము చెల్లించి అనుమతి పొందాల్సిందే.

ప్రైవేట్‌ లేఅవుట్లకు ఆన్‌లైన్‌లో అనుమతులు

బొబ్బిలి:

ఇళ్ల స్థలాల కోసం ప్రైవేట్‌ వ్యక్తులు వేసే లేఅవుట్లకు అనుమతి ఇచ్చే అధికారం పంచాయతీ కార్యదర్శులకు లేదు. లేఅవుట్లు వేసేవారు విధిగా ఆన్‌లైన్‌లో నిర్ణీత రుసుము చెల్లించి అనుమతి పొందాల్సిందే. జిల్లాలో  విచ్చల విడిగా వెలస్తున్న లేఅవుట్లకు ఆయా పంచాయతీల కార్యదర్శులు  ఎడాపెడా అనుమతులు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనధికారికంగా వెలుస్తున్న లేఅవుట్లలో బోర్డులు పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నప్పటికీ దిగువస్థాయి సిబ్బంది   బేఖాతరు చేస్తున్నారు.  ఇటువంటి  వాటికి చెక్‌ పెట్టి అనధికార లేఅవుట్లను  క్రమబద్ధీకరించు కునేందుకు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రవేశపె ట్టింది. దీని గడువును వచ్చే నెలాఖరు వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. సాధారణంగా లేఅవుట్ల అప్రవూల్‌కు చదరపు అడుగుకు 14 శాతం రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఎల్‌ఆర్‌ఎస్‌లో దరఖాస్తు చేసుకునే వారికి 7 శాతం రుసుం చెల్లిస్తే సరిపోతుంది. అయినప్పటికీ అనధికార లేఅవుట్ల యజమానులు ముం దుకు రావడం లేదు. జిల్లావ్యాప్తంగా 150 అనధికార లేఅవుట్లు ఉన్నట్లు గుర్తిం చామని  జిల్లా పట్టణప్రణాళికాధికారి సత్యనారాయణ తెలిపారు.  300 చదరపు అడుగులు దాటితే కచ్చితంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సిందేనని చెప్పారు. పంచాయతీల ద్వారా పొందే అనుమతులు చెల్లవని, పంచాయతీ కార్యదర్శులకు అనుమతులు ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేశారు. అనధికార లేఅవుట్లలో బోర్డులు పెట్టాలని అన్ని పంచాయతీలను కోరామన్నారు.  ఆయా లేఅవుట్లలో ఇళ్ల స్థలాల రిజిస్ర్టేషన్‌లు చేయొద్దని సంబంధిత అధికారులకు  సమాచారం అందిం చామని తెలిపారు. వచ్చే నెలాఖరు వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడింగించినందున ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.   

Updated Date - 2020-11-14T04:32:42+05:30 IST