రేపటి నుంచి దివ్యాంగుల గుర్తింపు శిబిరం

ABN , First Publish Date - 2020-03-04T10:55:43+05:30 IST

మంగళపాలెం గురుదేవ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఓఎన్‌జీసీ ఆర్థిక సాయంతో ఈనెల 5వ తేదీ నుంచి కృత్రిమ అవయవాలు పంపిణీ చేసేం దుకు దివ్యాంగులు గుర్తింపు శిబిరాలు

రేపటి నుంచి దివ్యాంగుల గుర్తింపు శిబిరం

కొత్తవలస, మార్చి 3: మంగళపాలెం గురుదేవ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఓఎన్‌జీసీ ఆర్థిక సాయంతో ఈనెల 5వ తేదీ నుంచి కృత్రిమ అవయవాలు పంపిణీ చేసేం దుకు దివ్యాంగులు గుర్తింపు శిబిరాలు నిర్వహిస్తున్నట్టు ట్రస్టు వ్యవస్థాపకుడు రాపర్తి జగదీష్‌బాబు తెలిపారు. ఈనెల 5న విశాఖపట్టణం జిల్లా యలమంచిలిలో, 6న తెలం గాణ రాష్ట్రం ఆదిలాబాద్‌ జిల్లాలో, 7న హైదరాబాద్‌లో, 9న కర్నాటక రాష్ట్రంలోని గుల్బార్గా జిల్లాలో, 10న బెంగుళూరులో శిబిరాలు నిర్వహిస్తామన్నారు. అవసరమైన దివ్యాంగులకు సంబంధించి అవయవాల కొలతలు తీసుకుని, వారికి కృత్రిమ అవయవాలు తయారు చేసి, ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. అలాగే వినికిడి యంత్రాలు, వీల్‌చైర్స్‌, ట్రైసైకిళ్లు అందజేస్తామని పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-04T10:55:43+05:30 IST