-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Identification of the eight isolation wards
-
ఎనిమిది ఐసోలేషన్ వార్డుల గుర్తింపు
ABN , First Publish Date - 2020-03-24T08:10:48+05:30 IST
పట్టణంలో కరోనా వైరస్ కేసులకు సంబంధించి ముందస్తుగా ఎనిమిది ఐసోలేషన్ కేంద్రాలను

సాలూరు, మార్చి 23: పట్టణంలో కరోనా వైరస్ కేసులకు సంబంధించి ముందస్తుగా ఎనిమిది ఐసోలేషన్ కేంద్రాలను గుర్తించినట్లు తహసీల్దార్ ఇబ్రహీం తెలిపారు. ఆర్‌సీఎం పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల,జూనియర్ కళాశాల, ప్రభుత్వ హై స్కూల్, ఆర్సీఎం హైస్కూల్, సత్యసాయి, వాసవీ జూనియర్ కాశాశాలలతోపాటు త్రిశూల్ రమణ పాఠశాలల్లో ఐసోలేషన్ సంబంధించి పడకలు సిద్ధంచేస్తున్నట్లు తెలిపారు.
ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. కరోనా నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ నూకేశ్వరరావు కోరారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈకార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీవాసరావు, తహసీల్దార్ ఇబ్రహీం తదితరులుపాల్గొన్నారు. కరోనా వైరస్ నివారణకు చర్యలు తీసుకోవాలని పట్టణ ఎస్సై టి. శ్రీనివాసరావు పట్టణ ప్రజలను కోరారు. షాపులను ఆయన మూసివేయించారు.