-
-
Home » Andhra Pradesh » Vizianagaram » How was Bhumipuja performed on the day given by Jivo
-
జీవో ఇచ్చిన రోజే భూమిపూజ ఎలా చేశారు?
ABN , First Publish Date - 2020-12-27T05:37:55+05:30 IST
స్థానిక సీహెచ్‌సీ గత ప్రభుత్వం వంద పడకల ఆసు పత్రిగా మార్పుచేస్తూ జీవో ఇచ్చిన రోజే భూమిపూజ ఎలా చేశారని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రశ్నిం చారు. శనివారం ఆయన విలేఖరు లతో మాట్లాడారు.

సాలూరు : స్థానిక సీహెచ్‌సీ గత ప్రభుత్వం వంద పడకల ఆసు పత్రిగా మార్పుచేస్తూ జీవో ఇచ్చిన రోజే భూమిపూజ ఎలా చేశారని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రశ్నిం చారు. శనివారం ఆయన విలేఖరు లతో మాట్లాడారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి గత ప్రభుతం జీవో నెం.36ను విడుదల చేసిందని, అయితే ఆ జీవో ఇచ్చిన రోజే భూమి పూజ ఎలా చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వత పరిపాలనా ఆమోదం, సాంకేతిక ఆమోదంతో పాటు టెండర్ ప్రక్రియ ఉంటుందని అన్నారు. అవేమీ లేకుండా భూమి పూజలు ఎలా చేస్తారన్నారు.