5న గురుకులాల్లో సీట్లకు లాటరీ

ABN , First Publish Date - 2020-11-04T04:27:06+05:30 IST

కలెక్టరేట్‌లో ఈ నెల 5న లాటరీ ప్రాతిపదికన గురుకులాల్లో ఖాళీ సీట్లను కేటాయిస్తారని ప్రిన్సిపాల్‌, కన్వీనర్‌ కోడి రాంబాబు మంగళవారం తెలిపారు.

5న గురుకులాల్లో సీట్లకు లాటరీ

బొబ్బిలి నవంబరు 3: 

కలెక్టరేట్‌లో ఈ నెల 5న లాటరీ ప్రాతిపదికన గురుకులాల్లో ఖాళీ సీట్లను కేటాయిస్తారని ప్రిన్సిపాల్‌, కన్వీనర్‌ కోడి రాంబాబు మంగళవారం తెలిపారు. బొబ్బిలి బాలుర, తాటిపూడి బాలికల, గుంటూరు జిల్లా తాడికొండ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ బాలుర, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో  6,7 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను  వెల్లడించారు. ఈ మేరకు  బాలుర పాఠశాలల్లో ఆరో తరగతిలో ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ-ఏ,బీ కేటగిరీల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఏడు సీట్లు, ఏడో తరగతిలో ఎస్సీ-1, బీసీ బీ-1 చొప్పున రెండుసీట్లు ఉన్నాయన్నారు. బాలికల పాఠశాలలో ఆరో తరగతిలో ఓసీ-1, ఎస్సీ-5, బీసీ-ఏ,బీ కేటగిరీల్లో ఒక్కొక్కటి, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కోటాలో ఒకటి చొప్పున మొత్తం 9 సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఏడో తరగతిలో ఓసీ-2, ఎస్సీ -1, బీసీ-బీ,సీ కేటగిరీల్లో ఒక్కొక్కటి, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కోటాలో ఒకటి చొప్పున  సీట్లు ఉన్నట్లు తెలిపారు. 

 

 

Updated Date - 2020-11-04T04:27:06+05:30 IST