‘అనర్హులకే ఇళ్ల స్థలాలు’

ABN , First Publish Date - 2020-12-30T06:13:23+05:30 IST

ఇళ్ల స్థలాల పంపిణీ కేవలం అధికార పార్టీకి చెందిన అనర్హులకే తప్పా ఎక్కడా అర్హులైన నిరుపేదలకు ఇచ్చిన దాఖలాలు లేవని మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఆరోపించారు.

‘అనర్హులకే ఇళ్ల స్థలాలు’
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు

గజపతినగరం: ఇళ్ల స్థలాల పంపిణీ కేవలం అధికార పార్టీకి చెందిన అనర్హులకే తప్పా ఎక్కడా అర్హులైన నిరుపేదలకు ఇచ్చిన దాఖలాలు లేవని మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. గ్రామాల్లో అర్హులైన నిరుపేదలకు కాకుం డా వైసీపీ కార్యకర్తలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం శోచనీయమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆల్తి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ రైతులకు మాత్రం ఎటువంటి ప్రయోజనాలు చేకూరలేదని అన్నారు. దళారీ వ్యవస్థకు ప్రభుత్వం  కొమ్ము కాస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్‌ ఎ.లక్ష్ము నాయుడు, మాజీ వైస్‌ ఎంపీపీ కనకళ పోలినాయుడు, లెంక  బంగారునాయుడు తదితరులు పాల్గొన్నారు.

 

 


Updated Date - 2020-12-30T06:13:23+05:30 IST