-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Homes are limited
-
ఇళ్లకే పరిమితం కావాలి
ABN , First Publish Date - 2020-03-24T08:18:59+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని, బయట తిరగడం మంచిది కాదని ఎంపీ

విజయనగరం ఎంపీ బెల్లాన
31 వరకూ లాక్‌డౌన్
చీపురుపల్లి, మార్చి 23: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని, బయట తిరగడం మంచిది కాదని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సూచించారు. సోమవారం చీపురుపల్లిలోని తన నివాసంలో వ్యాపారులు, పోలీసు, వైద్య ఇతర అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కరోనా వైరస్ మరింత ఉధృతి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. దీనిలో భాగంగానే ఈనెల 31 వరకూ రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటించిందని తెలిపారు.
నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మందుల దుకాణాలు తప్పా మిగతావి మూసివేయాలన్నారు. దీనికి వ్యాపారులు సహకరించాలని కోరారు. దీన్ని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంపీ హెచ్చరించారు. సమావేశంలో ఎంపీడీవో కె.రామకృష్ణంరాజు, తహశీల్దారు పీవీ శ్యామసుందర్, ప్రభుత్వాసుపత్రి డీసీఎస్ డాక్టర్ నారాయణ, ఎస్‌ఐ దుర్గాప్రసాద్, వ్యాపారులు పాల్గొన్నారు.