కట్టుదిట్టమైన చర్యలతోనే కరోనా నివారణ
ABN , First Publish Date - 2020-04-05T10:17:57+05:30 IST
జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న కారణంగానే కరోనా వైరస్ సోకిన కేసులు లేకుండా చేయగలిగామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు.

క్వారంటైన్లో 5285 మంది
ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి
(విజయనగరం-ఆంధ్రజ్యోతి): జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న కారణంగానే కరోనా వైరస్ సోకిన కేసులు లేకుండా చేయగలిగామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. శనివారం జిల్లాపరిషత్ అతిథి గృహం వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి విషయంలో గట్టి చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు. జిల్లాకు వచ్చేటప్పటికీ ఇతర దేశాల నుంచి వచ్చిన వారు 476 మంది ఉన్నారని, వీరిని హోమ్ క్వారంటైన్ చేశామన్నారు. 76మంది ఇతర జిల్లాలు, రా ష్ట్రాలకు వెళ్లారని చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా 27 క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశామ ని, 1150 మందిని జేఎన్టీయూ క్వారంటైన్లో, 4135 మందిని హోమ్ క్వారంటైన్లో ఉంచామన్నారు. వీరిని వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు, రెవెన్యూ సేవలు అభినందనీయమన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే లు కోలగట్ల వీరభద్రస్వామి, రాజన్నదొర, శ్రీనివాసరావు, బొత్స అప్పలనరసయ్య, శం బంగి వెంకట చినప్పలనాయుడు, వైసీపీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తది తరులు పాల్గొన్నారు.
కార్డుదారులకు ఉచిత రేషన్, నగదు పంపిణీ
డెంకాడ : పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ లాక్డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను ఉచితంగా రేషన్, వెయ్యి రూపాయలు నగదును అందిస్తున్నామని తెలిపారు. పెదతాడివలస గ్రామంలో కార్డుదారులకు రేషన్‌తో పాటు నగదు, మాస్క్‌లను ఆమె పంపిణీ చేశారు. అనంతరం ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామ వలంటీర్ల ద్వారా కార్డుదారుల ఇళ్లకే నగదు, రేషన్ పంపిణీ చేయిస్తున్నామ న్నారు. అందరికీ సరుకులు అందుతాయని, ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పారు. వలంటీర్లకు ప్రజలు సహకరించాలని కోరారు.
రేషన్ డిపోల వద్ద సరుకులు తీసుకునే సమయంలో భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రజలకు సేవలు అందించేం దుకు వలంటీర్లు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు స్వీయనిర్బంధంలో ఉండాలని కోరారు. కరోనాకు మందులేదని, నివారణ ఒక్కటే మార్గమని చెప్పారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి, జిల్లా పౌరసరఫరాల అధికారి పి.పాపారావు, తహసీల్దార్ పి.చంద్రమౌళి, ఎంపీడీవో స్వరూ పారాణి, సీడీపీవో ఆరుద్ర, ఈవోపీఆర్డీ అప్పలనాయుడు, ఏపీఎం సత్యనారాయణ, వైసీపీ మండల అధ్యక్షుడు బి.వాసుదేవరావు, నాయకులు చిరంజీవిరాజు, కె.త్రినాథ రావు, బుగత రమణ తదితరులు పాల్గొన్నారు.