-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Home deeds for 96544 people
-
96,544 మందికి ఇళ్ల పట్టాలు.. సిద్ధం చేస్తున్న అధికారులు
ABN , First Publish Date - 2020-12-16T04:10:06+05:30 IST
జిల్లాలో 96,544 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పట్టాలను ముద్రించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే అనేకసార్లు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది.

స్థలాల కోసం ఇప్పటి వరకూ రూ.172 కోట్లు ఖర్చు
కలెక్టరేట్, డిసెంబరు 15: జిల్లాలో 96,544 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పట్టాలను ముద్రించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే అనేకసార్లు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. చివరికి ప్రభుత్వం ఈనెల 25న చేపట్టేందుకు ముహూర్తం ఖరారు చేసింది. జిల్లాలో ఇప్పటి వరకూ 1,164 లేవుట్లు వేయగా.. 12 చోట్ల కోర్టు కేసులు ఉన్నాయి. వాటిని మినహాయించి 1,152 లేఅవుట్లలో 71,237 మందికి పట్టాలు పంపిణీ చేయనున్నారు. కోర్టు కేసులు పరిష్కారమైతే... మిగతా వారికి పట్టాలు అందనున్నాయి. అలాగే 8,843 మందికి టిడ్కో పట్టాలు ఇదే సమయంలో అధికారులు అందజేయనున్నారు. 24,237 మందికి సొంత స్థలాలు ఉండటంతో వారికి పొజిషన్ పట్టాలు అందజేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆగస్టు నుంచి గత నెల 25 వరకూ స్పందన కార్యక్రమంలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న 2,642 మందికి (90 రోజుల కార్యక్రమం ప్రకారం) కూడా పట్టాలు అందజేయనున్నారు. మొత్తంగా ఈ స్థలాల కోసం ఇప్పటివరకూ రూ.172 కోట్లు కేటాయించారు. మరో రూ.35 కోట్లకు సంబంధించిన బిల్లులు అప్‌లోడ్ చేశారు. విజయనగరం పట్టణ వాసులకు 15వేల మందికి గుంకలాంలో అతి పెద్ద లేవుట్‌లో ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. ఈనెల 25 నుంచి నియోజకవర్గ ఎంఎల్‌ఏలు వీటిని పంపిణీ చేయనున్నారు.