క్రీడాకారిణికి అండగా ధర్మవరం వాసవీక్లబ్‌

ABN , First Publish Date - 2020-11-07T05:44:52+05:30 IST

ధర్మవరం ఉన్నత పాఠ శాలలో చదువుతున్న షటిల్‌ క్రీడాకారిణి పంపాన మౌనికకు ధర్మవరం వాసవీక్లబ్‌ సభ్యులు అండగా నిలి చారు.

క్రీడాకారిణికి అండగా ధర్మవరం వాసవీక్లబ్‌

శృంగవరపుకోట రూరల్‌: ధర్మవరం ఉన్నత పాఠ శాలలో చదువుతున్న షటిల్‌ క్రీడాకారిణి పంపాన మౌనికకు ధర్మవరం వాసవీక్లబ్‌ సభ్యులు అండగా నిలి చారు. గత కొంతకాలంగా షటిల్‌క్రీడలో అద్భుత ప్రతిభ చూపుతున్న మౌనికకు శుక్రవారం రూ, 3వేలు విలువచేసే షటిల్‌ రాకెట్‌ను అందించారు. ఈసందర్భంగా సంఘ అధ్యక్ష,కార్యదర్శులు సునీల్‌,రాజు మాట్లాడుతూ తమ క్లబ్‌ విద్య, ఆటల్లో రాణిస్తున్నవారికి అండగా ఉం టుందని తెలిపారు. ఈ క్రీడాకారిణికి భవిష్యత్‌లో మరింత అండగా ఉంటామని సంఘ చార్టర్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస రావు, సభ్యులు బుచ్చిబాబు, సతీష్‌ తెలిపారు. వాసవీ సం ఘంకు పాఠశాల పీడీ శ్రీరాములు కృతజ్ఞతలు తెలిపారు

====


Updated Date - 2020-11-07T05:44:52+05:30 IST