పొదుపుతో ఆరోగ్యకర జీవితం
ABN , First Publish Date - 2020-12-21T04:16:42+05:30 IST
పొదుపు పాటించడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యకర మైన.. ప్రశాంతమైన జీవితాన్ని గడపగలరని కలెక్టర్ హరిజవహర్‌లాల్ అన్నారు. దాసన్నపేట విద్యుత భవనంలో ఆదివారం జరిగిన ఇంధన పొదుపు వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కలెక్టర్ హరిజవహర్‌లాల్
విజయనగరం (ఆంధ్రజ్యోతి)/ రింగురోడ్డు, డిసెంబరు 20 : పొదుపు పాటించడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యకర మైన.. ప్రశాంతమైన జీవితాన్ని గడపగలరని కలెక్టర్ హరిజవహర్‌లాల్ అన్నారు. దాసన్నపేట విద్యుత భవనంలో ఆదివారం జరిగిన ఇంధన పొదుపు వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చెరువులను కాపాడడం, నీటిని పొదుపుగా వాడటం, మొక్కలు నాటడం, భూమిని పరిరక్షించుకోవడం చాలా అవసరమన్నారు. పొదుపుగా గుండె కొట్టుకోవడం వల్ల తాబేలు ఎక్కువ కాలం జీవిస్తోందని, మనిషి యాంత్రిక జీవనంలో పడి సంపాదనే ముఖ్యమని ఒత్తిడితో బతకడం వల్ల ప్రతి ఇంట్లో రోగాలు బారిన పడే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడాలంటే పర్యావరణాన్ని నాశనం చేసే రసాయనాల వినియోగం తగ్గించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఎల్‌ఈడీలు, సోలార్ ప్యానల్ వాడితే విద్యుత పొదుపుతో పాటు పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ వై.విష్ణు, ఈఈ ఎం.కృష్ణమూర్తి, డీఈ గోపాలరావు, సిబ్బంది పాల్గొన్నారు.
సీఎం పర్యటనకు ఏర్పాట్లు షురూ
ఈ నెల 30న జిల్లాలో సీఎం జగన్ పర్యటనకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం గుంకలాం లే అవుట్‌ను కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ పరిశీలించారు. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, జేసీలు కిషోర్‌కుమార్, ఆర్.మహేష్‌కుమార్ కూడా లే అవుట్‌ను సందర్శించారు. హెలిపాడ్ స్థలం, పైలాన్ నిర్మించే చోటు, బహిరంగా సభావేదిక, ఆర్చ్‌లను ఏర్పాటు చేసే స్థలాలను మ్యాప్ ద్వారా పరిశీలించారు. ఇళ్లపట్టాల పంపిణీలో ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూడాలని.. ఏర్పాట్లను పక్కాగా చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. హౌసింగ్ పీడీ ఎస్‌వీ రమణమూర్తి, వైసీపీ నాయుకులు మజ్జి శ్రీనివాసరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.