గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వలేం...
ABN , First Publish Date - 2020-06-25T11:41:37+05:30 IST
జిల్లాలోని తొమ్మిది మండలాలను కలుపుతూ నిరిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణానికి తాము భూములు ఇవ్వలేమని

డిప్యూటీ కలెక్టర్‌కు తేల్చి చెప్పిన రైతులు
వసంత(గంట్యాడ), జూన్ 24 : జిల్లాలోని తొమ్మిది మండలాలను కలుపుతూ నిరిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణానికి తాము భూములు ఇవ్వలేమని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు తేల్చి చెప్పారు. బుధవారం వసంత గ్రామానికి వచ్చి డిప్యూటీ కలెక్టర్ ధర్మరావు రైతులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తామంతా సన్న, చిన్న కారు రైతులు కావడం వల్ల భూమిని కోల్పోతే జీవనో పాధి దెబ్బతింటుందని, అందువల్ల భూములు ఇవ్వలేమంటూ తీర్మానం చేసి డిప్యూటీ కలెక్టర్‌కు తెలియజేశారు. కార్యక్రమంలో వసంత గ్రామానికి చెందిన గంగునాయడు, కేకే స్వామి నాయుడు, కొర్లాం నుంచి రంభ సత్యారావు, పెంట శ్రీరాంపురం గ్రామానికి చెందిన కరక ముత్యాలు నాయుడు తదితరులు పాల్గొన్నారు