‘ప్రజలను మభ్యపెడుతున్న ప్రభుత్వం’

ABN , First Publish Date - 2020-11-27T05:21:03+05:30 IST

కేంద్ర ప్రభుత్వ పథకాలకు, నిఽదులకు వైసీపీ రంగు పూసి సీఎం జగన్మోహనరెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని టీడీపీ నాయకులు విమర్శించారు.

‘ప్రజలను మభ్యపెడుతున్న ప్రభుత్వం’
మాట్లాడుతున్న టీడీపీ నేతలు

నెల్లిమర్ల, నవంబరు 26: కేంద్ర ప్రభుత్వ పథకాలకు, నిఽదులకు వైసీపీ రంగు పూసి సీఎం జగన్మోహనరెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని టీడీపీ నాయకులు విమర్శించారు. కొత్తపేటలో గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగార్రాజు మాట్లాడారు.  పేదలకు రుణాలిస్తున్నామని చెప్పి ధ్రువపత్రాలు పంపిణీ చేసి, ప్రభుత్వం తరఫున షూరిటీ లేకుండా తప్పించుకుంటున్నారని వారు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వనిధి పథకాన్ని జగనన్న తోడు పథకంగా పేరు మార్చుకున్నారని వారు ఆరోపించారు.  టీడీపీ సానుభూతిపరుల ఆస్తులను కనీసం నోటీసులు జారీ చేయకుండా రాత్రికి రాత్రి కూలదోస్తున్నారని, ఇది హేయమైన చర్య అని వారు మండిపడ్డారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు సువ్వాడ రవిశేఖర్‌, పతివాడ తమ్మినాయుడు, కర్రోతు సత్యనారాయణ, కంది చంద్రశేఖర్‌, ఆకిరి ప్రసాద్‌, గేదెల రాజారావు, అట్టాడ శ్రీధర్‌ (బుజ్జి), గురాన అసిరినాయుడు, బయిరెడ్డి లీలావతి, లెంక అప్పలనాయుడు, నాగేశ్వరరావు, ఇజ్జురోతు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T05:21:03+05:30 IST