విద్యార్థుల ఇళ్లకే సరుకులు
ABN , First Publish Date - 2020-03-27T11:26:09+05:30 IST
కరోనా నియంత్రణలో భాగంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించిన
పార్వతీపురం రూరల్/ గరుగుబిల్లి, మార్చి 26 : కరోనా నియంత్రణలో భాగంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో గరుగుబిల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళళ్ల అవసరమైన సరుకులను గురువారం అందించారు. ఈ మేరకు ఎంఈవో ఎన్.నాగభూషణరావు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి విద్యార్థులకు నేరుగా బియ్యం, చక్కీలు, గుడ్లును సంబంధిత సీఆర్‌పీల సహాయంతో అందిస్తున్నామన్నారు. గ్రామాల పరిధిలో అందిస్తున్న సరుకుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నామన్నారు. మండలాలు, పట్టణాల్లో చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజన సరుకులు అందించనున్నామని విద్యా శాఖ స్పష్టం చేసింది.