జీవో నంబరు 77ను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-27T05:35:39+05:30 IST

ప్రైవేటు, ఎయిడెడ్‌ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో చదువుతున్న పీజీ, ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల విద్యార్థులకు జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన వర్తించవంటూ జీవో నెంబరు 77ను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ జీవోను రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.రమేష్‌, పి.రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు.

జీవో నంబరు 77ను రద్దు చేయాలి

బెలగాం: ప్రైవేటు, ఎయిడెడ్‌ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో చదువుతున్న పీజీ, ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల విద్యార్థులకు జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన వర్తించవంటూ జీవో నెంబరు 77ను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ జీవోను రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.రమేష్‌, పి.రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం వీరు విలేఖరులతో మాట్లాడుతూ జీవో నెంబరు 77 వల్ల రాష్ట్రంలోని పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారని, తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలన్నారు. అలాగే 2018-19, 2019-20 విద్యా సంవత్సరాల్లో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం ఇప్పటికీ విద్యార్థులకు చెల్లించకపోవడంతో అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గతంలో పాదయాత్ర చేపట్టిన సమయంలో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్ధికి స్కాలర్‌షిప్‌ రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని చెప్పారని, ఇప్పుడు దీనిలో కోతలు విధించడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారన్నారు. 

===================

సాగులో మెలకువలతోనే లాభాలు

శృంగవరపుకోట రూరల్‌ (జామి) డిసెంబరు 26: పంటలు వేసే రైతులు తమ పంటలపై దీమాగా ఉండాలంటే పంటల సాగులో మెళుకువలు తెలుసు కోవాలని ప్రకాశం జిల్లా మార్కపురం ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు భానుశ్రీ, సాయిగ్రీష్మ, ధర్మతేజ, రవిశంకర్‌ అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో వీరు రైతులను కలిసి పంటలసాగులో మెళకువలు, ఆధునిక వ్యవసాయంపై అవ గాహన కల్పించారు. గ్రామీణ రైతులు సమగ్ర వ్యవసాయం, అజోల్లా వాడకం గురించి వివరించారు.

====================

కరువు పరిహారం అందించాలి

శృంగవరపుకోట రూరల్‌ (జామి): మండలంలో 2017-18లో తీవ్రదుర్భిక్షం ఏర్పడడంతో అప్పటి ప్రభుత్వం జామి మండలాన్ని కరువుప్రాంతంగా ప్రకటించిందని జి ల్లాలో అన్ని మండలాలకు కరువు పరిహారం వచ్చినా తమ మండలానికి రాలేదని తాండ్రంగి గ్రామ యువరైతు పోలిపర్తి అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ తమ మండలంలో వర్షాభావం ఏర్పడి 2700 ఎకరాల పంట దెబ్బతిందని, 7000మంది రైతులు నష్టపోయారని తెలిపారు. జామి మండలానికి  అప్పటి ప్రభుత్వం రూ.మూడుకోట్ల 26 లక్షలు మంజూరు చేసినట్లు ప్రకటించింది కానీ రైతులకు మాత్రం అంద లేదన్నారు. దీనిపై కలెక్టర్‌ పరిశీలించి రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2020-12-27T05:35:39+05:30 IST