వైభవంగా పోలిపాడ్యమి

ABN , First Publish Date - 2020-12-16T04:07:18+05:30 IST

జిల్లా ప్రజలు పోలిపాడ్యమిని మంగళవారం వైభవంగా నిర్వహించారు. కార్తీకమాసమంతా ఉపవాస దీక్షలు చేసిన మహిళలు.. పోలిపాడ్యమి రోజున నదులు, చెరువుల వద్దకు వెళ్లి దీపారాధన చేశారు. నెల్లిమర్లలోని చంపావతి నదిలో వందలాదిగా భక్తులు దీపాలు విడిచిపెట్టారు.

వైభవంగా పోలిపాడ్యమి
భక్తుల దీపారాధన

ఆలయాల వద్ద భక్తుల రద్దీ

శోభాయమానంగా దీపారాధన  

విజయనగరం రూరల్‌, డిసెంబరు 15: జిల్లా ప్రజలు  పోలిపాడ్యమిని మంగళవారం  వైభవంగా నిర్వహించారు. కార్తీకమాసమంతా ఉపవాస దీక్షలు చేసిన మహిళలు.. పోలిపాడ్యమి రోజున నదులు, చెరువుల వద్దకు వెళ్లి దీపారాధన చేశారు. నెల్లిమర్లలోని చంపావతి నదిలో వందలాదిగా భక్తులు దీపాలు విడిచిపెట్టారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం పురోహితులకు బియ్యం, కూరగాయలు తదితర వస్తువులను దానమిచ్చి ఆశీస్సులు పొందారు. బొబ్బిలి, పార్వతీపురం, గరుగుబిల్లి, సాలూరు, ఎస్‌.కోట, గజపతినగరం, నెల్లిమర్ల, గుర్ల, చీపురుపల్లి తదితర ప్రాంతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాడ్యమి పూజలు చేశారు. విజయనగరంలోని కంటోన్మెంట్‌, శివాలయం వీధి, పూల్‌బాగ్‌లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో భక్తులు విశేషంగా పూజలు నిర్వహించారు. బాబామెట్ట డబుల్‌కాలనీలోని మల్లికార్జున స్వామి ఆలయంలో మూలవిరాట్‌కు అన్నాభిషేకం చేశారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు, నియమాలు పాటించిన భక్తులు పోలిపాడ్యమి రోజున పూజలు నిర్వహించిన అనంతరం కార్తీకమాసం ముగిసినట్టవుతోంది. ఇక ధనుర్మాసంలోకి అడుగు పెడతారు.


Read more