ట్రాక్టర్‌ ప్రమాదంలో బాలిక మృతి

ABN , First Publish Date - 2020-12-14T04:56:26+05:30 IST

పట్టణంలోని బ్యాంకు కాలనీలో ట్రాక్టర్‌ కిందపడి బాలిక మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

ట్రాక్టర్‌ ప్రమాదంలో బాలిక మృతి

బొబ్బిలి, డిసెంబరు 13: పట్టణంలోని బ్యాంకు కాలనీలో ట్రాక్టర్‌ కిందపడి బాలిక మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బ్యాంకు కాలనీలో పార్కింగ్‌ చేసి ఉన్న ట్రాక్టర్‌ పై ఆదివారం రాత్రి ఆ కాలనీకి చెందిన పిల్లలంతా ఆడుకుంటున్నారు. ఆ సమ యంలో గేర్‌లో ఉన్న ట్రాక్టర్‌ ఒక్కసారిగా స్టార్టయి ముందుకు దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో నిమ్మాని ప్రణతి (10) ట్రాక్టర్‌ నుంచి ఎగిరిపడి పక్కనే గోడకు గట్టిగా ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఈ బాలికతో పాటు మరో 8 మంది పిల్లలు ఆడుకుంటున్నారు. వారిలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి.  మృతురాలి తండ్రి నిమ్మాని రాజీవ్‌ శ్రీకాకుళం జిల్లా పలాస మునిసిపాలిటీలో ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టరుగా పనిచేస్తున్నారు. ప్రణతికి తల్లి స్వప్న, అక్క, అన్నయ్య ఉన్నారు. ఈ ప్రమాదం వెనుక వేరే కారణం ఉందేమోనని సీఐ కేసవరావు ఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ చదలవాడ సత్యనారాయణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

 

Updated Date - 2020-12-14T04:56:26+05:30 IST