8న ఉచిత వైద్య శిబిరం
ABN , First Publish Date - 2020-12-06T05:02:00+05:30 IST
గొంగాడవలసలో ఈనెల 8న ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు గ్రామ సేవా సమితి అధ్యక్షుడు జి.శంకర రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
బొబ్బిలి రూరల్, డిసెంబరు 5: గొంగాడవలసలో ఈనెల 8న ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు గ్రామ సేవా సమితి అధ్యక్షుడు జి.శంకర రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖకు చెందిన కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ వైవీఎస్.అనిత ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించ నున్నా మని పేర్కొన్నారు. బీపీ, షుగర్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులు తనిఖీ చేయించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.