ఎస్టీ విద్యార్థులకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

ABN , First Publish Date - 2020-09-03T10:41:37+05:30 IST

రాష్ట్ర నైపుణ్యాభివృద్థి సంస్థ ఆధ్వర్యంలో టెన్త్‌ పూర్తి చేసిన ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ శిక్షణ ఇవ్వ నున్నట్లు జి

ఎస్టీ విద్యార్థులకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

విజయనగరం (ఆంధ్రజ్యోతి):  రాష్ట్ర నైపుణ్యాభివృద్థి సంస్థ ఆధ్వర్యంలో టెన్త్‌ పూర్తి చేసిన ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ శిక్షణ ఇవ్వ నున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పీబీ సాయిశ్రీనివాస్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.  18 నుంచి 45ఏళ్ల వారికి మూడు రకాల ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తామన్నారు.


వీటీలో కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌, హార్డ్‌ వేర్‌ విత్‌ సాఫ్ట్‌ స్కిల్స్‌, ఎంఎస్‌ ఆఫీస్‌ , డొమస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌, బేసిక్‌ మల్టీ మీడియా తదితర కంప్యూటర్‌ క్లాసులను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న యువతీయువకులు ఈ నెల 7, సాయంత్రం 5గంటల లోపు డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ.ఏపీఎస్‌ఎస్‌డీసీ.ఇన్‌ అనే వెబ్‌సైట్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలన్నారు. మరిన్ని వివారాలకు టోల్‌ఫ్రీ నెంబర్‌ 18004252422 సంప్రదిం చాలని సూచించారు. 

Updated Date - 2020-09-03T10:41:37+05:30 IST