-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Four arrested in marital murder case
-
వివాహిత మృతి కేసులో నలుగురి అరెస్టు
ABN , First Publish Date - 2020-12-20T05:28:47+05:30 IST
వరకట్నం వేధింపులతో మహిళ మృతికి కారుకులైన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు తెలిపారు.

వరకట్న వేధింపులే కారణం
డీఎస్పీ మోహనరావు
గజపతినగరం/మెంటాడ, డిసెంబరు 19: వరకట్నం వేధింపులతో మహిళ మృతికి కారుకులైన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్ కార్యాలయానికి శనివారం వచ్చిన ఆయన.. ఈ కేసుపై విలేకర్లతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మెంటాడ మండలం ఆగూరుకు చెందిన గెద్ద వెంకటేష్‌కు ఆరేళ్ల కిందట వసంతతో వివాహమయ్యింది. పెళ్లిలో కట్నం బకాయి ఉండడంతో భర్త వెంకటేష్‌తో పాటు అత్త లక్ష్మమ్మ, ఆడపడుచు శారద, బావ మహేష్‌లు తరుచూ వేధింపులకు గురి చేశారు. దీంతో వసంత ఈనెల 17న ఉరి పోసుకొని మృతి చెందినట్టు ఆయన తెలిపారు. ఈమేరకు శనివారం ఆగూరు గ్రామంలో దర్యాప్తు చేపట్టామన్నారు. దర్యాప్తు అనంతరం ఆ నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. దర్యాప్తులో ఆండ్ర ఎస్‌ఐ షేక్ శంకర్ ఉన్నారు. సమావేశంలో గజపతినగరం ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు పాల్గొన్నారు.