ప్రకృతి వ్యవసాయంపై దృష్టి

ABN , First Publish Date - 2020-11-26T05:40:08+05:30 IST

రైతులందరూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని ప్రకృతి వ్యవసాయ వనరుల ఉత్పత్తి కేంద్రం జిల్లా ప్రాజక్టు మేనేజర్‌ కె.ప్రకాశ్‌ అన్నారు.

ప్రకృతి వ్యవసాయంపై దృష్టి

రైతులందరూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని ప్రకృతి వ్యవసాయ వనరుల ఉత్పత్తి కేంద్రం జిల్లా ప్రాజక్టు మేనేజర్‌ కె.ప్రకాశ్‌ అన్నారు. పోలిపల్లి, లింగాలవలస గ్రామాల్లో బుధవారం పకృతి వ్యవసాయ వనరుల ఉత్పత్తి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పకృతి వ్యవసాయానికి ఘన, ద్రవ జీవామృతాలు, కాషాయాలు అందుబాటులో ఉంచనున్నామన్నారు. రైతులు విరివిగా రసాయనాలు, ఎరువులు, పురుగు మందులు వాడుతున్నారని వీటి కారణంగా నేల నిస్సారమవుతుందన్నారు. ఏవో హరికృష్ణ మాట్లాడుతూ ప్రతి రైతూ పకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. అనంతరం సమీపంలో ఉన్న పంట పొలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-26T05:40:08+05:30 IST