విద్యుదాఘాతంతో చేపలు

ABN , First Publish Date - 2020-09-13T10:51:21+05:30 IST

గోపాలపల్లి పరిధిలోని వెన్నెవెల్లివాని చెరువులోని చేపలు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు

విద్యుదాఘాతంతో చేపలు


శృంగవరపుకోట రూరల్‌: గోపాలపల్లి పరిధిలోని వెన్నెవెల్లివాని చెరువులోని చేపలు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండురోజుల కిందట వీచిన ఈదురుగాలులకు ఈ చెరువును ఆనుకొని ఉన్న విద్యుత్‌ స్తంభం తీగలు తెగి చెరువులో పడ్డాయి. దీంతో ఈ చెరువులో ఉన్న సుమారు రూ.50 వేలు గల చేపలన్నీ మృతి చెందాయి. ఆ సమయంలో అటువైపు ఎవరూ వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఆ గ్రామస్థులు చెబుతున్నారు. కాగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని పెంపకందారులు జనా సన్యాసి, పోలిపల్లి ఆప్పారావు కోరుతున్నారు.

Updated Date - 2020-09-13T10:51:21+05:30 IST