-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Fire in Kottur
-
కొత్తూరులో అగ్ని ప్రమాదం
ABN , First Publish Date - 2020-12-30T06:11:41+05:30 IST
కొత్తూరు గ్రామంలో సోమవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదం లో ఆరు పూరిళ్లు ఆగ్నికి ఆహుతయ్యాయి.

ఆరు పూరిళ్లు దగ్ధం
రూ.3లక్షలు ఆస్తి నష్టం
గరుగుబిల్లి: కొత్తూరు గ్రామంలో సోమవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదం లో ఆరు పూరిళ్లు ఆగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమా దంలో శంబంగి సింహాచలం, ద్వారపురెడ్డి జయమ్మ, బొత్స శ్రీనివాసరావు, ద్వారపురెడ్డి అప్పలనరసమ్మ, గొట్టాపు చిన్నంనాయుడు, ద్వారపురెడ్డి గౌరమ్మలకు చెందిన గృహాలు కాలిబూడిదయ్యాయి. ఈ సంఘటనలో సుమారు రూ.3లక్షలు ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేశారు. అగ్ని ప్రమాదంపై మాజీ ఎంపీపీ ద్వారపురెడ్డి ధనుంజయరావు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలియపరచడంతో హుటాహుటిన పార్వతీపురం అగ్నిమాపక ఇన్‌చార్జి అధికారి దత్తి శ్రీరాములు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల ను అదుపుచేశారు. సుమారు ఆరు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ధనుంజయనాయుడు కోరారు.