నేడు రైతుభరోసా కేంద్రాలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-05-30T10:48:35+05:30 IST

వ్యవసాయ అనుబంధ సేవలకుగాను ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే

నేడు రైతుభరోసా కేంద్రాలు ప్రారంభం

జిల్లాలో 664 కేంద్రాలు


సాలూరు రూరల్‌, మే 29:

వ్యవసాయ అనుబంధ సేవలకుగాను ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. శనివారం కేంద్రాలను ప్రారంభించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.   కేంద్రాల ద్వారా వ్యవసాయం, అనుబంధ సేవలు అందించనున్నారు. రైతులకు రాయితీపై విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందుబాటులో ఉంచనున్నారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు, మత్స్య, పశుసంవర్థకశాఖ సహాయకులు అందుబాటులో ఉండి సేవలందించనున్నారు.


ఖరీఫ్‌, రబీలో మట్టి నమూనాల సేకరణ, విత్తన నాణ్యత పరీక్షలు చేపట్టనున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే కొత్త వంగడాల తయారీ, సాగు మెలకువలు తదితర సాగు సలహాలు, సూచనలు అందించనున్నారు. జిల్లావ్యాప్తంగా 664 కేంద్రాలను ఏర్పాటుచేశామని...ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎం.ఆశాదేవి తెలిపారు.

Updated Date - 2020-05-30T10:48:35+05:30 IST