ధాన్యం కొనుగోలులో విఫలం

ABN , First Publish Date - 2020-12-30T06:16:13+05:30 IST

రైతులు పండించిన ధాన్యా న్ని తక్షణమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు డిమాండ్‌ చేశారు.

ధాన్యం కొనుగోలులో విఫలం
పార్వతీపురం రూరల్‌: ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

పార్వతీపురం రూరల్‌, డిసెంబరు 29: రైతులు పండించిన ధాన్యా న్ని తక్షణమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు డిమాండ్‌ చేశారు. లచ్చిరాజుపేట, తదితర గ్రామాల్లో మంగళవారం ర్యాలీ చేసి, రైతుల సమస్యలను తెలుసుకున్నారు. టీడీపీ నాయకులు వెంకటనాయుడు, వెంకటరావు, సీతారాం తదితరులు పాల్గొన్నారు.  

 

బొబ్బిలి రూరల్‌: రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభు త్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని వామపక్షాలు డిమాండ్‌ చేశాయి. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో రైతు సంఘాలు, వామపక్ష నాయకులు ఆందోళన నిర్వహించారు.  


గరుగుబిల్లి: ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం నాయకులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఉల్లిభద్ర ప్రధాన రహదారిపై ధాన్యానికి నిప్పంటించి నిరసన తెలిపారు. సీపీఎం నాయకులు బీవీ రమణ, కె.రవీంద్ర పాల్గొన్నారు. నిరసన చేస్తున్న రైతుల వద్దకు తహసీల్దార్‌ వీవీ సన్యాసిశర్మ చేరుకుని, అక్ర మాలకు పాల్పడుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.   


బొబ్బిలి: ధాన్యం కొనుగోలు తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం రోడ్డుపై ధాన్యం తగులబెట్టి నిరసన తెలిపారు. అప్పయ్యపేట రోడ్డులోని మిల్లుకు ధాన్యాన్ని తరలించిన మల్లమ్మపేట రైతు లు ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై నినాదాలు చేశారు. గోనెసంచులను ఇవ్వడం లేదని, నిబంధనల పేరుతో రైతులను ఇక్కట్లకు గురిచేస్తున్నారని సీఐటీయూ నాయకుడు శంకరరావు తెలిపారు. 


Updated Date - 2020-12-30T06:16:13+05:30 IST