ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పెంపు
ABN , First Publish Date - 2020-12-02T05:24:02+05:30 IST
మైనార్టీ విద్యార్థు లకు ఇచ్చే ఉపకార వేతనాల కోసం చేసుకునే దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేది వరకూ పెంచినట్టు జిల్లా మైనార్టీశాఖాధికారిణి ఎం.అన్నపూర్ణమ్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

విజయనగరం (ఆంధ్రజ్యోతి) : మైనార్టీ విద్యార్థు లకు ఇచ్చే ఉపకార వేతనాల కోసం చేసుకునే దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేది వరకూ పెంచినట్టు జిల్లా మైనార్టీశాఖాధికారిణి ఎం.అన్నపూర్ణమ్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తొలుత నవంబరు 30 వరకూ మాత్రమే గడువు ఉండేదని, కళాశాలలు నవంబరులో తెరిచిన నేపథ్యంలో గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. మైనార్టీ విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్, మెరిట్ కమ్ మీన్స్ జాతీయ ఉపకార వేతనాలను ఏటా అందిస్తున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాలకు 9490498948, 8247554334 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు.