జలకళతో అంతా సస్యశ్యామలం

ABN , First Publish Date - 2020-11-16T04:50:41+05:30 IST

వైఎస్సార్‌ జలకళ పథకంతో రాష్ట్రంలో బీడు భూములు కూడా సస్యశ్యామలమవుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు.

జలకళతో అంతా సస్యశ్యామలం
వైఎస్సార్‌ జలకళ బోరును ప్రారంభిస్తున్న పుష్ప శ్రీవాణి

ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి

కురుపాం, నవంబరు 15: వైఎస్సార్‌ జలకళ పథకంతో రాష్ట్రంలో బీడు భూములు కూడా సస్యశ్యామలమవుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు. ఆదివారం కురుపాం పంచాయతీ కస్పాగ దబవలస గిరిజన గ్రామంలో వైఎస్సార్‌ జలకళ పథకం ప్రారంభించారు. ఈ సం దర్భంగా మంత్రి పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ జలకళ పథకంతో సీఎం మెట్ట భూ ముల రైతుల కన్నీళ్లు తుడిచారని కితాబిచ్చారు.  బోరు వేయడంతో పాటు దానికి అవసరమైన మెటారును, విద్యుత్‌ సరఫరాను కూడా ప్రభుత్వమే ఉచితంగా సమకూరుస్తుందన్నారు. వెలుగు ఏపీడీ శ్రీహరి, మాజీ జడ్పీటీసీ శెట్టి పద్మావతి, ఏఎంసీ చైర్మన్‌ వెంకటరావు, కళింగ వైశ్య కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కొత్తకోట సురేష్‌కు మార్‌, వైసీపీ నాయకులు శెట్టి నాగేశ్వరరావు, రైతులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-16T04:50:41+05:30 IST