సచివాలయాల పరీక్షలకు కేంద్రాల ఏర్పాటు
ABN , First Publish Date - 2020-09-18T10:20:19+05:30 IST
ఈనెల 20నుంచి 26వరకు నిర్వహించ నున్న గ్రామ, వార్డు, సచివాలయాల పరీక్షలకు సంబంధించి గజపతినగరం మండలంలో 6, బొండపల్లి మండలంలో 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎంపీడీవో కె.కిషోర్‌కుమార్ తెలిపారు

గజపతినగరం, సెప్టెంబరు 17: ఈనెల 20నుంచి 26వరకు నిర్వహించ నున్న గ్రామ, వార్డు, సచివాలయాల పరీక్షలకు సంబంధించి గజపతినగరం మండలంలో 6, బొండపల్లి మండలంలో 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎంపీడీవో కె.కిషోర్‌కుమార్ తెలిపారు. గురువారం స్థానిక ప్రభుత్వ బాలుర హైస్కూలులో పరీక్షా కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షలకు 15,503మంది అభ్యర్థులు హాజరు కానున్నట్టు తెలిపారు.
మరుపల్లి గ్రామంలో బాలాజీ పాలిటెక్నికల్ కళాశాలలో 352మంది, గజపతినగరం బాలుర హైస్కూలులో 128 మంది, ప్రభుత్వ బాలికల హైస్కూలు లో 128మంది, ఆదిత్య జూనియర్ కళాశాలలో 160మంది, ప్రతిభా కళాశాలలో 144మంది, శ్రీకృష్ణావిద్యాపీఠ్ హైస్కూలులో 160మంది అభ్యర్థులు పరీక్షలకు హాజ రు కానున్నట్టు చెప్పారు.
అలాగే బొండపల్లి మండలంలోని సాయిసిద్ధార్థ కళాశాల లో 264మంది, జిల్లా పరిషత్ హైస్కూలులో 192మంది పరీక్షలకు హాజరు కాను న్నట్లు తెలిపారు.పరీక్షా కేంద్రాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.