-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Environmental protection with clay vinayaka statues
-
మట్టి వినాయక ప్రతిమలతోనే పర్యావరణ పరిరక్షణ
ABN , First Publish Date - 2020-08-20T10:33:48+05:30 IST
మట్టి వినాయక ప్రతిమలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని స్పార్క్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు పీవీ పద ్మనాభం చెప్పా

విజయనగరం రూరల్, ఆగస్టు 19: మట్టి వినాయక ప్రతిమలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని స్పార్క్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు పీవీ పద ్మనాభం చెప్పారు. బుధవారం సాయంత్రం కొత్తపేట, యాదవవీధి, బంగారమ్మ చదురు వద్ద మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రగతి స్వచ్ఛంద సేవా సంఘం సభ్యులు దుర్గాప్రసాద్, రాంబాబు, తాతీయ్యలు, పైడిరాజు, కె.రవి, జి. చిన్న, సీహెచ్ పైడిరాజు పాల్గొన్నారు.
విజయనగరం దాసన్నపేట: మట్టి వినాయక ప్రతిమలను పూజించి, పర్యా వరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలని శిష్టకరణం సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంపీజీ ఈశ్వరరావు చెప్పారు. సంఘ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఇళ్లలోనే మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజలు చేయాలని సూచించారు.
విజయనగరం రింగురోడ్డు: నగరంలోని అయ్యన్నపేట జంక్షన్‌లో మదర్‌థెరిస్సా సేవా సంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్ సంయుక్తంగా 200 మట్టి వినాయక ప్రతిమలను పంపణీ చేశారు.
సంఘ అధ్యక్షుడు ప్రసాద్ పట్నాయక్, ప్రతినిధులు శ్రావణి, శ్రీనివాస్, కీర్తన, తనీష్ తదితరులు పాల్గొన్నారు.
ఫబొబ్బిలి: స్థానిక శ్రీకళాభారతి ఆడిటోరి యంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. వనమిత్ర కృష్ణదాసు, సమరసతాఫౌండేషన్ మండల ప్రచారకులు దూపంవాసు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాభారతి ప్రతినిధి నంబియార్ వేణుగోపాలరావు, బీజేపీ నేత పుల్లెల శ్రీనివాస రావు, యెన్నా బాబు, మహేష్ పాల్గొన్నారు.
గుర్ల: ఆనందపురం గ్రామానికి చెందిన నవభారత యువజన సంఘం ఆధ్వర్యంలో గుర్లలో ఎస్‌ఐ లీలావతి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. సంఘం అధ్యక్షులు దాసరి ఈశ్వరరావు, శీర అప్పలనాయుడు, రౌతు సత్యనారాయణ, ఆల్తి ధర్మారావు, సంఘం సభ్యులు పాల్గొన్నారు .