నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు

ABN , First Publish Date - 2020-12-29T05:08:55+05:30 IST

నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పీవీ శ్రీనివాస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు

విజయనగరం (ఆంధ్రజ్యోతి), డిసెంబరు 28: నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పీవీ శ్రీనివాస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, వివిధ కంపెనీల భాగస్వామ్యంతో వివిధ కంపెనీల్లో ఖాళీల భర్తీకి ఈ-పరిశ్రమ ఆధా రిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు హెచ్‌బీఎల్‌ పవర్‌ సిస్టమ్‌ లిమిటెడ్‌, నెల్లిమర్ల జూట్‌ మిల్లు పరిశ్రమల్లో ఆధారిత శిక్షణ, ఉపాధి కార్యక్రమాలు ప్రారంభి స్తామన్నారు. అర్హత గల అభ్యర్థులకు ఈనెల 30న జిల్లా నైపుణ్యాభివృద్ధి కార్యాలయంలో ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహిం చనున్నట్లు చెప్పారు. హెచ్‌బీఎల్‌ పవర్‌ సిస్టమ్స్‌లో (ప్రొడక్షన్‌ ఆపరేటర్‌, హెల్పర్స్‌)  సంబంధించి  టెన్త్‌ పాస్‌, నెల్లిమర్ల జూట్‌ మిల్లునకు సంబంధించి ఐటీఐ ఎలక్ర్టికల్‌, మెకానికల్‌, ఫిట్టర్‌, ఎన్‌సీ ఆపరేటర్స్‌, మెకానిక్స్‌  (టెన్త్‌ లోపు చదువకునేవారు) అర్హులని వెల్లడించారు.  ఎంపికైన అభ్యర్థులకు 15 రోజులు లేదా 30 రోజుల పాటు ఉచిత భోజన వసతి కల్పించి, పరిశ్రమధారిత శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఉత్తీర్ణులైన వారికి ఆయా సంస్థల్లో ఉద్యోగం కల్పి స్తామన్నారు. మరిన్ని వివరాల కోసం టోల్‌ ఫ్రీ నెంబర్లు  18004252422, 85558 32416 సంప్రదించాలని సూచించారు. 

 

Updated Date - 2020-12-29T05:08:55+05:30 IST