వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తాం : జేసీ-2

ABN , First Publish Date - 2020-06-23T10:16:10+05:30 IST

కరోనా కష్టకాలంలో దేశం నలుమూలల నుంచి జిల్లాకు చేరుకున్న వలస కార్మికులందరికీ ఉపాధి కల్పిస్తామని ..

వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తాం : జేసీ-2

విజయగనరం (ఆంధ్రజ్యోతి), జూన్‌ 22 : కరోనా కష్టకాలంలో దేశం నలుమూలల నుంచి జిల్లాకు చేరుకున్న వలస కార్మికులందరికీ ఉపాధి కల్పిస్తామని జేసీ-2 ఆర్‌.కూర్మనాథ్‌ చెప్పారు. సోమవారం పరిశ్రమలు, భవన నిర్మాణరంగ ప్రతినిధులతో డీఆర్‌డీఏ సమావేశ మందిరంతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. వలస కార్మికులకు విద్యార్హత, అనుభవం, నైపుణ్యం అధారంగా పనికల్పిస్తామన్నారు. ఇప్పటివరకు వచ్చిన నివేదికల ప్రకారం జిల్లాలోని 18 వేల మంది వలస కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. డీఆర్‌డీఏ పీడీ మాట్లాడుతూ వెలుగు సంఘాల ద్వారా జిల్లాకు వచ్చిన వలస కార్మికులను గుర్తించినట్టు తెలిపారు. సమీక్షలో జడ్పీ సీఈవో టి.వెంకటేశ్వరావు,  డ్వామా పీడీ అయితా నాగేశ్వరావు, పీఆర్‌ ఎస్‌ఈ విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more