ఎస్సీల అభ్యున్నతికి కృషి: జేసీ

ABN , First Publish Date - 2020-12-06T05:04:27+05:30 IST

జిల్లాలో ఎస్సీల అభ్యున్నతికి అన్ని విధాలుగా కృషి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జేసీ కిషోర్‌కుమార్‌ తెలిపారు.

ఎస్సీల అభ్యున్నతికి కృషి: జేసీ

కలెక్టరేట్‌, డిసెంబరు 5 : జిల్లాలో ఎస్సీల అభ్యున్నతికి అన్ని విధాలుగా కృషి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జేసీ కిషోర్‌కుమార్‌ తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలోని షెడ్యూల్డ్‌ కులాల ఉప ప్రణాళిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్డ్‌ కేటగిరీలో ఉన్న ఉప కులాలను అభివృద్ధి పథకంలోకి  తీసుకురావాలని, వారి జీవితాల్లో వెలుగులు నింపా లని సూచించారు.  సమావేశంలో డీఆర్‌వో ఎం.గణపతిరావు , సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సునీల్‌రాజుకుమార్‌ తదితరులు ఉన్నారు. 

 

Updated Date - 2020-12-06T05:04:27+05:30 IST