మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రించాలి

ABN , First Publish Date - 2020-12-16T05:26:28+05:30 IST

జాతీయ స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సావాల్లో భాగంగా డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎస్పీలు, డీఐజీ, ఎస్‌ఈబీ అధికారులతో మాట్లాడారు. ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకుని గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు జిల్లాల్లో అక్రమ తరలింపును అడ్డుకోవాలని డీజీపీ పిలుపునిచ్చారు.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా  నియంత్రించాలి


విజయనగరం (క్రైం): జాతీయ స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సావాల్లో భాగంగా డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎస్పీలు, డీఐజీ, ఎస్‌ఈబీ అధికారులతో మాట్లాడారు. ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకుని  గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు జిల్లాల్లో  అక్రమ తరలింపును అడ్డుకోవాలని డీజీపీ పిలుపునిచ్చారు. అనం తరం ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ.. జిల్లా లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించాలని,  అనధికారంగా నిల్వలు కలిగిన వారిపై కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా దాడులు నిర్వహించాలని, ఎక్కడి కక్కడ వాహన తనిఖీలు చేపట్టాలని సూచించారు.  మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాల ను ప్రజలకు వివారించాలన్నారు. ఎస్‌ఈబీ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ఎప్పటికప్పుడు వివరాలను ప్రత్యేక విభాగానికి తెలియపర్చాలని ఎస్పీ ఆదేశించారు. 

  ఎస్పీ ఆకస్మిక సందర్శన

బాడంగి:  నేరాల అదుపు చేసేందుకు ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని  ఎస్పీ రాజకుమారి సూచించారు. మంగళవారం రాత్రి  స్థానిక పోలీసు స్టేషన్‌ను  సందర్శించారు.  నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న చోట అప్రమత్తమై వాటిని నిలువరించాలన్నారు. కరోనా  వైరస్‌ నివారణకు కృషి చేసిన పోలీసులను  అభి నందించారు. ఎస్‌ఐ సురేంద్రనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Updated Date - 2020-12-16T05:26:28+05:30 IST